తెలంగాణ

telangana

ETV Bharat / state

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్​రెడ్డికి కరోనా - jc prabhakar reddy corona news

ఏపీలోని కడప జైలులో రిమాండ్‌లో ఉన్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి కరోనా పాజిటివ్​ నిర్ధరణయ్యింది. జైలులో మొత్తం 317 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలింది.

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్​రెడ్డికి కరోనా
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్​రెడ్డికి కరోనా

By

Published : Aug 19, 2020, 12:46 AM IST

ఏపీలోని కడప జైలులో రిమాండ్‌లో ఉన్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి కరోనా పాజిటివ్​ నిర్ధారణయ్యింది. ఈ క్రమంలో జైలు సిబ్బంది ఆయన్ను ప్రత్యేక గదిలో ఉంచి.. ముగ్గురు వైద్యులతో పర్యవేక్షణ చేయిస్తున్నారు. బీఎస్​-4 వాహనాల రిజిస్ట్రేషన్​ వ్యవహారంలో ఇటీవల బెయిల్​పై విడుదలైన అనంతరం జేసీ ప్రభాకర్​రెడ్డిని 24 గంటల్లోనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టు చేశారు.

సోమ, మంగళవారం నిర్వహించిన పరీక్షల్లో.. జైలులో మొత్తం 317 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మొత్తం అందరినీ ప్రత్యేక వార్డుల్లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు.

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్​రెడ్డికి కరోనా

ఇదీ చదవండి: ఫేస్​బుక్ సీఈఓకు కాంగ్రెస్ లేఖ, శివసేన గరం!

ABOUT THE AUTHOR

...view details