కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు... టీ-వర్క్స్ వివిధ ఆవిష్కర్తలతో చేతులు కలుపుతోంది. కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో... అవసరమైన వైద్య పరికరాల కోసం డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో వెంటిలేటర్లు, వైద్యుల రక్షణ పరికరాలు అత్యవసరమైనవి కాగా... వాటి డిజైన్, ప్రోటో టైపింగ్, ఉత్పత్తి, అభివృద్ధిపై టీ-వర్క్స్ దృష్టి సారించి... టీ-వర్క్స్ రక్షణ పరికరాన్ని ఆవిష్కరించింది.
వైద్యుల కోసం రక్షణ పరికరాన్ని ఆవిష్కరించిన టీ-వర్క్స్ - వైద్యుల రక్షణ పరికరం
కరోనాను ఎదుర్కోవడానికి వివిధ ఆవిష్కర్తలతో కలిసి టీ- వర్క్స్ రక్షణ పరికరాన్ని ఆవిష్కరించింది. వైరస్ సోకిన బాధితుడి నుంచి వైద్యులు తమను తాము కాపాడుకునేందుకు ఇది దోహదం చేయనుంది.
వైద్యుల కోసం రక్షణ పరికరాన్ని ఆవిష్కరించిన టీ-వర్క్స్
డిజైన్ల రూపకల్పన, ఆలోచనలు కార్యరూపం దాల్చేందుకు ఈ టీ-వర్క్స్ సహాయపడనుంది. పీపీఈ కిట్లు సహా... ఇతర ఉత్పత్తులను రూపొందించడంలో బహుళ ప్రాజెక్టులు, థర్డ్ పార్టీలతో కలిసి పనిచేస్తోంది.