తెలంగాణ

telangana

ETV Bharat / state

విశ్వవిద్యాలయాల సిబ్బంది వేతనాల పెంపు - ఉన్నత విద్యా సంస్థల సిబ్బంది వేతనాల పెంపు

తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల సిబ్బంది వేతనాలు పెరిగాయి. ఈ పెంపుతో ప్రతి ఏటా ప్రభుత్వంపై 264 కోట్ల రూపాయల అదనపు భారం పెరగనుంది.

విశ్వవిద్యాలయాల సిబ్బంది వేతనాల పెంపు

By

Published : Jun 29, 2019, 7:51 PM IST

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల సిబ్బంది వేతనాలు పెరిగాయి. ఏడో వేతన సవరణ కమిషన్ సిఫారసులకు అనుగుణంగా వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా 2778 మంది బోధనా సిబ్బందికి లబ్ధి చేకూరనుంది. 2019 ఏప్రిల్ నుంచి వేతనాలను చెల్లించనుంది. 2016 జనవరి ఒకటో తేదీ నుంచి పెరిగిన వేతనాలు అమల్లోకి వస్తాయి. 2019 మార్చ్ 31 వరకు 260 కోట్ల బకాయిలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరిస్తాయి. వేతనాల పెంపుతో ప్రతి ఏటా 264 కోట్ల రూపాయల అదనపు భారం సర్కారుపై పడనుంది. వేతనాల పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినందుకు విశ్వవిద్యాలయ, ఉన్నత విద్యాసంస్థల అధ్యాపక సంఘాలు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాయి.

విశ్వవిద్యాలయాల సిబ్బంది వేతనాల పెంపు

ABOUT THE AUTHOR

...view details