తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆర్టీసీ కార్మికులకు కావలసింది మద్దతు కాదు... సమస్యల పరిష్కారం' - ts rtc strike issue

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగడం బాధాకరమని టీఎన్‌జీవో నేత రవీందర్‌రెడ్డి అన్నారు. ఆర్టీసీ సిబ్బంది సమస్యలను యాజమాన్యం పట్టించుకోలేదని ఆరోపించారు. ఆర్టీసీ జేఏసీ నేతలు వచ్చి తమతో చర్చిస్తే తమ వైఖరేంటో చెబుతామన్నారు.

'ఆర్టీసీ కార్మికులకు కావలసింది మద్దతు కాదు... సమస్యల పరిష్కారం'

By

Published : Oct 13, 2019, 3:23 PM IST

తెలంగాణ జేఏసీ ఉద్యోగులకు తెలియకుండానే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారని టీఎన్​జీవో నేత రవీందర్​ రెడ్డి అన్నారు. సమ్మె విషయం తమతో చర్చించి ఉంటే ఆ సమస్యకు పరిష్కారం ఆలోచించేవాళ్లమని పేర్కొన్నారు. కనీసం మాట మాత్రం కూడా చెప్పకుండా సమ్మెకు వెళ్లి ఈరోజు మద్దతివ్వలేదనటం బాధాకరమన్నారు. రాజకీయ నాయకులు వారి స్వార్థం కోసమే ఆర్టీసీ కార్మికుల సమ్మెను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. ఈ సమయంలో ఆర్టీసీ కార్మికులకు కావలసింది మద్దతు కాదు... సమస్యల పరిష్కారం అన్నారు. ఆర్టీసీ జేఏసీ నేతలు తమతో చర్చిస్తే తమ వైఖరిని చెబుతామన్నారు. ఈ నెల21న ఎన్నికల కోడ్​ ముగియగానే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details