తెలంగాణ

telangana

ETV Bharat / state

'నూతన ఆవిష్కరణలకు సంపూర్ణ సహకారం' - jayesh ranjan

​​​​​​​ టీ-హబ్​తో సమానంగా గ్రామీణ ప్రాంతాల్లో సృష్టించే ఆవిష్కరణలకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ నైపుణ్యాభివృద్ధి సంస్థ(టీ-ఇన్నోవేషన్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామీణ ఆవిష్కరణల ప్రదర్శనను ప్రారంభించారు.

గ్రామీణ ఆవిష్కరణల ప్రదర్శన

By

Published : Jun 2, 2019, 10:00 PM IST

'నూతన ఆవిష్కరణలకు సంపూర్ణ సహకారం'

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ నైపుణ్యాభివృద్ధి సంస్థ (టీ-ఇన్నోవేషన్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామీణ ఆవిష్కరణల ప్రదర్శనను ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రారంభించారు. విద్యార్థుల నుంచి రైతుల వరకు ఎంతో మంది తమ సమస్యలకు పరిష్కారాలు అన్వేషిస్తూ... చక్కటి ఆవిష్కరణలకు రూపమిస్తున్నారని జయేశ్​ రంజన్​ అభినందించారు. టీ-హబ్​తో సమానంగా గ్రామీణ ప్రాంతాల్లో సృష్టించే ఆవిష్కరణలకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు.

సందడిగా పీపుల్స్ ప్లాజా

ఈ కార్యక్రమానికి ఆసు యంత్ర సృష్టికర్త చింతకింది మల్లేశం ముఖ్యఅతిథిగా హాజరై రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఆవిష్కర్తలను అభినందించారు. వ్యవసాయ, వైద్య, సాంకేతిక రంగాల్లో ప్రజలకు ఉపయుక్తమైన సుమారు 60కిపైగా ఆవిష్కరణలు ఇక్కడ కొలువుదీరాయి. వాటిని చూడడానికి పెద్ద సంఖ్యలో సందర్శకులు పీపుల్స్ ప్లాజాకు తరలి వచ్చారు.

ఇవీ చూడండి: ఆధారాలు దొరికాయి.. చరవాణి కోసం గాలింపు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details