తెలంగాణ

telangana

By

Published : Apr 11, 2020, 5:05 PM IST

ETV Bharat / state

టీ కొవిడ్- 19 యాప్​ను ఆవిష్కరించిన కేటీఆర్

కరోనా వైరస్​ సంబంధిత సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ యాప్​ను రూపొందించింది. టీ కొవిడ్-19 యాప్​ను ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.

ktr
ktr

కరోనా సంబంధిత విశ్వసనీయ సమాచారం కోసం రూపొందించిన టీ కొవిడ్-19 యాప్​ను ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. రాష్ట్ర ఆరోగ్య, ఐటీశాఖల సంయుక్త భాగస్వామ్యంలో తీసుకొచ్చిన ఈ యాప్ కొవిడ్-19​పై కచ్చితమైన సమాచారం రాష్ట్ర ప్రజలకు అందిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. హైదరాబాద్​కు చెందిన సిస్కో, క్వాంటెలా అనే స్టార్టప్స్ ఈ యాప్​ను అభివృద్ధి చేశాయి. ఈ యాప్ కొవిడ్ కేసుల సంఖ్యతో పాటు.. వైరస్ భయాందోళనలు పోగొట్టే ఏర్పాట్లు చేశారు. సెల్ఫ్ అసెస్​మెంట్ పరీక్షలు, దగ్గర్లోని టెస్ట్ సెంటర్లు, ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్ కేంద్రాలు, డాక్టర్ అపా​యింట్​మెంట్లు, ఎమర్జెన్సీ సర్వీసులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు, ఆరోగ్య నిపుణుల సలహాలు, జాగ్రత్తలు ఇలా అన్ని ఈ యాప్​లో పొందుపరిచారు.

ABOUT THE AUTHOR

...view details