తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది' - టీకాంగ్రెస్ తాజా వార్తలు

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని ఆయన విగ్రహానికి భట్టి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

'రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది'
'రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది'

By

Published : Dec 6, 2020, 5:40 PM IST

బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ అందించిన రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించేలా రాజ్యాంగాన్ని అందించారని కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని ఆయన విగ్రహానికి భట్టి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు రాజ్యాంగాన్ని కాలరాసి, రాజకీయ విధానాలను దేశంపై రుద్దుతున్నాయని తెలిపారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలింగించే ప్రయత్నాలను నిలువరించేందుకు ప్రజాస్వామ్య వాదులు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. జాతి నిర్మాణాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముందని భట్టి అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశం.. భవిష్యత్తుపై దిశానిర్దేశం

ABOUT THE AUTHOR

...view details