TSRTC hikes t 24 Ticket Price :ఒక్కసారి టికెట్ తీసుకున్నామంటే 24 గంటల పాటు నగరంలో ఎక్కడైనా తిరిగే వెసలుబాటు ఉంటుంది. వంద రూపాయల లోపే ఉన్న ఈ టికెట్ ధరలు సామాన్యులకు ఎంతో ఊరటగా ఉంటాయి. ఒక్కరోజులో సిటీ అంతా చక్కర్లు కొట్టే అవకాశం ఉంటుంది. అయితే హైదరాబాద్ పరిధిలోని సిటీ బస్సుల్లో 24 గంటలపాటు ప్రయాణించడానికి వెసులుబాటు కల్పించే టీ-24 టికెట్ ప్రస్తుత ధరల్ని పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. సాధారణ ప్రయాణికులకు ఈ టికెట్ ధరను 90 రూపాయల నుంచి వందకు పెంచినట్లు అధికారులు తెలిపారు.
- TSRTC Introduces Snack Box : ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి అమల్లోకి స్నాక్‌బాక్స్ విధానం
- TSRTC: చలచల్లగా పర్యావరణహితంగా.. టీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు
సాధారణ ప్రయాణికులకు ఈ టికెట్ ధరను రూ.90 నుంచి రూ.100కి పెంచింది. సీనియర్ సిటిజన్ల(పురుషులు, మహిళలు, 12 ఏళ్లపైబడిన బాలికలు)కు రూ.80 ఉండగా రూ.90 చేసింది. ఈ మేరకు ఆర్టీసీ ఈడీ(ఆపరేషన్స్) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ టీ-24 టికెట్ ధరలు జూన్ 16 నుంచి జులై 31 వరకు అమల్లో ఉంటాయని అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో సాధారణ ప్రయాణికులకుటీ-24 టికెట్ ధర రూ.100 ఉండగా.. ఏప్రిల్ 26న రూ.90కి తగ్గించింది. సీనియర్ సిటిజన్లకు రూ.80కి అందించింది. తాజాగా పాత ధరల్ని తీసేసి కొత్త ధరల్ని తీసుకొచ్చారు.
ఆర్టీసీ ఈడీ కార్యాలయాల తరలింపు :సిటీ బస్సులకు సంబంధించి జూబ్లీ బస్‌స్టేషన్‌లో ఉన్న గ్రేటర్ ఈడీ కార్యాలయాన్ని మిధానిలోని కమ్యూనిటీ ఎమినిటీస్ సెంటర్‌కు మార్చనున్నారు. అలాగే ఎంజీబీఎస్‌లో ఉన్న హైదరాబాద్ జోన్ ఈడీ ఆఫీస్‌ను కాచిగూడలోని కమ్యూనిటీ ఎమినిటీస్ కేంద్రానికి మార్చనున్నారు. ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాన కార్యాలయం బస్‌భవన్ ఈడీ (పరిపాలన) ఆదేశాలు జారీ చేశారు.