సముద్రాన్ని ఈదాలనుకోవటం తప్పంటారు పెద్దలు. అయితే పట్టుదల ఉంటే అవలీలగా ఈదెయ్యెచ్చంటున్నారు మన తెలుగింటి ఆడపడుచు గోలి శ్యామల. 43 ఏళ్ల వయసులో రామసేతును ఈది రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు ఈ ఘనత సాధించిన రెండో మహిళ మన హైదరాబాద్‌కి చెందిన శ్యామలే కావడం విశేషం.
తెలుగింటి ఆడపడుచు అరుదైన ఘనత.. రామసేతును ఈదిన రెండో మహిళ!
సముద్రాన్ని ఈదడమా? అమ్మో అని భయపడతారు చాలామంది. సాగరాన్ని ఓ మహిళ ఈదడమంటే పెద్ద సాహసమనే చెప్పవచ్చు. ఆ సాహసాన్ని అవలీలగా ఛేదించారు తెలుగింటి ఆడపడుచు గోలి శ్యామల. కేవలం 13 గంటల్లో రామసేతును ఈదారు. ఈ ఘనత సాధించిన రెండో మహిళ హైదరాబాద్‌కు చెందిన శ్యామల కావడం విశేషం.
స్మిమ్మింగ్ శ్యామల రికార్డు, రామసేతు ఈదిన హైదరాబాద్ శ్యామల
పాక్ జలసంధిగా పిలిచే రామసేతును ఈదటం అత్యంత కష్టమైందని.. ప్రాణాలు పోయే ప్రమాదం ఉందంటూ తెలిసినవారు స్నేహితులు వారించినా పట్టు వీడలేదు ఆమె. అనుకున్న లక్ష్యాలను సాధించాలన్న పట్టుదలతో ఇటీవలే పాక్ జలసంధిని కేవలం 13 గంటల 43 నిమిషాల్లో ఈదారు. ఈ నేపథ్యంలో గోలి శ్యామలతో ఈటీవీ భారత్ ముఖాముఖి...
ఇదీ చదవండి:కరోనా వేళ.. హోలీ ఇలా ట్రై చేయండి!