Swiggy delivery boys in hyderabad: హైదరాబాద్ వంటి నగరంలో ఫుడ్ డెలివరీ యాప్‌లకు(food delivery apps in hyderabad) విపరీతమైన డిమాండ్ ఉంటుంది. వీటిలో టాప్‌లో ఉన్న వాటిలో ఒకటి జొమాటో కాగా.. మరొకటి స్విగ్గీ. అసంఘటిత రంగంలో పనిచేసే డెలివరీ బాయ్స్ రోజూ పన్నెండు గంటలకు మించి కష్టపడుతున్నా.. చాలీచాలని జీతాలతో జీవితాలను(delivery boys salaries) నెట్టుకొస్తున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా పార్ట్ టైం, ఫుల్ టైం షిప్టుల్లో దాదాపు 20 వేలమందికి పైగా స్విగ్గీ డెలివరీ బాయ్స్ పనిచేస్తున్నారు. పలు రెస్టారెంట్ల నుండి ఆర్డర్లు తీసుకొని వినియోగదారుడి ఇంటివద్దకే డోర్ డెలివరీ చేస్తున్నారు. అయితే కొవిడ్ అనంతర పరిస్థితుల తర్వాత ఆహార రంగం వేగంగా కోలుకున్నా.. వీరి బతుకు బండి మాత్రం కుదేలైందని రైడర్స్(swiggy riders) వాపోతున్నారు. పెట్రోల్, ఇతర నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల వల్ల తమ ఆదాయాలకు భారీగా గండి పడిందని డెలివరీ బాయ్స్ ఆవేదన చెందుతున్నారు. రోజుకు 12-15 గంటలు పనిచేస్తున్నా ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు లాంటి కనీస అవసరాలు తీర్చలేకపోతున్నామని డెలివరీ బాయ్స్ వాపోతున్నారు.
గతంలో రూ.35 ఇచ్చేవారు
ఒకప్పుడు మినిమం బేస్ ఫెయిర్ 35 రూపాయలను చెల్లించిన స్విగ్గీ యాజమాన్యం(swiggy management).. దాన్ని క్రమంగా 20 రూపాయలకు తగ్గించిందని వాపోయారు. పెరుగుతున్న ఖర్చులకు ఇది ఏమాత్రం లాభసాటి కాదని కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ నుంచి డెలివరీ బాయ్స్ లొకేషన్ దూరానికి మాత్రమే ఛార్జీలు చెల్లిస్తున్నాయి. డోర్ స్టెప్ డెలివరీకి, మరిన్ని ఆర్డర్లు తీసుకునేందుకు తిరిగి రెస్టారెంట్‌కు చేరుకునేందుకు సమయం పెరిగి ఆదాయం తగ్గుతోందని కార్మికులు చెబుతున్నారు. వీటితో పాటు.. కంపెనీకి పనిచేసే స్విగ్గీ డెలివరీ బాయ్స్‌తో(swiggy delivery boys) పాటు.. ర్యాపిడో, షాడో ఫాక్స్ వంటి థర్డ్ పార్టీలకు ఆర్డర్ల(third parties in delivery) కేటాయింపుతో వీరి ఆదాయానికి గండి పడుతోంది. వీటికి తోడు దూరప్రాంతాల్లో డెలివరీలకు ప్రతి కిలోమీటర్ ఇచ్చే అదనపు ఛార్జీలను సగానికి తగ్గించారని.. వీటన్నింటినీ కంపెనీ సమీక్ష జరపాలని కార్మికులు కోరుతున్నారు.