హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా నేడు "తెలంగాణ బత్తాయి దినోత్సవం" జరగనుంది. రాజ్యసభ సభ్యుడు జోగిన్‌పల్లి సంతోష్‌కుమార్ పిలుపు మేరకు ఉదయం 10 గంటలకు బషీర్‌బాగ్ ఎల్‌బీ స్టేడియంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించనున్నారు. పర్యాటక, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇందులో పలు ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములయ్యాయి. ఈ సందర్భంగా 500 మంది క్రీడాకారులకు బత్తాయి పండ్లు పంపిణీ చేయనున్నారు. తెలంగాణ బత్తాయి డేను” పురస్కరించుకుని ప్రజలు పెద్ద ఎత్తున బత్తాయి పండ్లు కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ పిలుపునిచ్చింది.
భవిష్యత్‌లో కొరత...
కరోనా మహమ్మారి నేపథ్యంలో రాష్ట్రంలో మార్కెటింగ్ లేకపోవడం వల్ల టన్ను బత్తాయి 7 వేల రూపాయలకు కూడా మద్ధతు ధర రావట్లేదని తెలిపింది. ఈ పరిస్థితుల్లో ఆదివారం 500 నుంచి 800 టన్నుల బత్తాయి వితరణ చేయాలని నిర్ణయించారు. 2020 సంవత్సరంలో 20 కిలోలు ప్యాక్ 500 రూపాయల చొప్పున 2020 ప్యాకెట్లు విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనా వైరస్ ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉన్న దృష్ట్యా... భవిష్యత్తులో ఆహారం, తాజా పండ్ల కొరత ఉత్పన్నం కాబోతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి.