ఘనంగా ప్రమాణ స్వీకారం - VEMULA PRASHANTH REDDY
రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో ఈ కార్యక్రమం మొదలవగా వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డిలతో ముగిసింది.

ప్రమాణ స్వీకారం
రాజ్‌భవన్‌లో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని ఆహ్వానించారు. చివరగా వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డిలతో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి సీఎం కేసీఆర్, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, హరీశ్‌రావు, సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, ప్రజాప్రతినిధులు హాజరయారు.
ప్రమాణ స్వీకారం చేస్తున్న వేముల ప్రశాంత్ రెడ్డి
ప్రమాణ స్వీకారం చేస్తున్న చామకూర మల్లారెడ్డి
Last Updated : Feb 19, 2019, 1:01 PM IST