తెలంగాణ

telangana

ETV Bharat / state

'28,200 మంది స్వచ్ఛ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి' - స్వచ్ఛ కార్మికుల నిరస లక్డీకపూల్

హైదరాబాద్ లక్డీకపూల్​ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట రాష్ట్ర ఎస్‌ఎస్‌ఏ స్వచ్ఛ కార్మికుల యూనియన్‌ ఆందోళనకు దిగింది. 2015లో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన 28,200మంది కార్మికులను తొలగించడం అన్యాయమని.. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ రమ తెలిపారు.

'28, 200 మంది స్వఛ్చ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి'
'28,200 మంది స్వచ్ఛ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి'

By

Published : Sep 24, 2020, 11:45 PM IST

హైదరాబాద్ లక్డీకపూల్​లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట రాష్ట్ర ఎస్‌ఎస్‌ఏ స్వచ్ఛ కార్మికుల యూనియన్‌ ఆందోళనకు దిగింది. సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్వచ్ఛ కార్మికులు పాల్గొని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

స్వచ్ఛ భారత్ పేరుతో 2015లో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన 28,200మంది స్వచ్ఛ కార్మికులను తొలగించడం అన్యాయమని.. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ రమ తెలిపారు. అట్టడుగు వర్గానికి చెందిన వీరికి గతంలో నెలకు రూ. 3,500 వేతనం ఇచ్చేవారని.. ఇప్పుడు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాల్సిందిపోయి... రూ. 2,500 తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు.

కరోనా కష్ట కాలంలో అదనంగా ఆర్థిక వెసులుబాటు కల్పించి... కాపాడాల్సిన ప్రభుత్వం ఉన్న ఉద్యోగులను తీసివేసి రోడ్డుపాలు చేయడం దుర్మార్గమని రమ మండిపడ్డారు. ఇప్పటికైనా తొలగించిన 28,200 మంది స్వచ్ఛ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:నేరరాజకీయాల పట్ల సర్వత్రా ఆందోళన, నిరసన

ABOUT THE AUTHOR

...view details