స్వచ్ఛ సర్వేక్షణ్ క్లీన్లీనెస్ సర్వే-2021గా పేర్కోనే ఈ సర్వే ద్వారా స్వచ్ఛతపై నగరాలకు మార్కులు కేటాయించనున్నారు. 2021 జనవరి 1 తేదీ నుంచి మార్చి 28 వరకు నిర్వహించే... ఈ సర్వేలో గ్రేటర్ హైదరాబాద్ వాసుల ప్రశ్నలకు సానుకూల సమాధానాలు ఇవ్వడం ద్వారా హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛతలో అగ్రస్థానంలో నిలపాలని జీహెచ్‌ఎంసీ విజ్ఞప్తి చేసింది.
జనవరి 1 నుంచి స్వచ్ఛ సర్వేక్షన్ సర్వే - swachh survekshan 2021
స్వచ్ఛత, పారిశుద్ధ్యం, పరిశుభ్రతపై ప్రజాభిప్రాయ సేకరణ ద్వారానే ర్యాంకింగ్‌లు ప్రకటించడానికి కేంద్ర స్వచ్ఛభారత్ మిషన్ ప్రాధాన్యతనిచ్చింది. దీనిలో భాగంగా 2021 స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని మూడు విభాగాలుగా విభజించి ర్యాంకింగ్‌లను జారీచేయనున్నారు.
![జనవరి 1 నుంచి స్వచ్ఛ సర్వేక్షన్ సర్వే swachh survekshan 2021](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10067242-120-10067242-1609395723508.jpg)
ముఖ్యంగా గతంలో మాదిరిగానే స్వచ్ఛ కార్యక్రమాలు, తడి, పొడి చెత్త వేర్వేరు, ఇంటింటి నుంచి చెత్త సేకరణ, కాలనీ, బస్తీ సంక్షేమ సంఘాల భాగస్వామ్యం, ఓడీఎఫ్‌కు చర్యలు, బహిరంగ మలమూత్ర విసర్జన నివారణ చర్యలు, స్వచ్ఛతపై చైతన్య కార్యక్రమాలు, 50 మైక్రాన్ల కన్నా... తక్కువ నిడివి ఉన్న ప్లాస్టిక్ నిషేధం, పొడి, తడి చెత్త విడదీయడం లాంటి ప్రశ్నలు ప్రస్తుత 2021 స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పొందుపర్చారని జీహెచ్‌ఎంసీ వివరించింది.
ఈ ప్రశ్నలకు 1800 మార్కులు కేటాయించారని... మొత్తం 6వేల మార్కులకు గానూ సర్వీస్ లెవల్ ప్రొగ్రెస్కు 2400 మార్కులు, సర్టిఫికేషన్‌కు 1800 మార్కులు కేటాయించారు. ఈ సర్వే ద్వారా వచ్చిన మార్కులను దేశంలోని ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, మెట్రో సిటీలకు వచ్చిన మార్కులతో పోల్చి అధికంగా వచ్చిన మార్కుల ప్రాతిపదికంగా స్వచ్ఛ సర్వేక్షణ్-2021 ర్యాంకింగ్‌లను ప్రకటిస్తారు. ముఖ్యంగా మున్సిపల్ సంస్థలు, స్వచ్ఛ సర్వేక్షణ్‌లో చేపట్టిన అంశాలపై సమర్పించే నివేదికల ఆధారంగా నగరవాసులను 5 ప్రశ్నలతో ఫోన్ల ద్వారా సంప్రదిస్తారని జీహెచ్‌ఎంసీ తెలిపింది.
- ఇదీ చదవండి:దేశంలో 96 శాతానికి కరోనా రికవరీ రేటు