సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లిలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాత విమానాశ్రయ రహదారికి ఇరువైపులా ఉన్న చెత్తను తొలగించారు. పారిశుద్ధ్య కార్మికులకు ఉచితంగా దుస్తులను అందజేశారు.
బోయిన్పల్లి విమానాశ్రయ రహదారిలో స్వచ్ఛ భారత్ - బోయిన్పల్లి విమానాశ్రయ రహదారిలో స్వచ్ఛభారత్ కార్యక్రమం
సికింద్రాబాద్‌లోని బోయినపల్లి పాత విమానాశ్రయ రహదారిలో వాకర్స్ ఆసోసియేషన్ సభ్యులు స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం వాకింగ్ వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. ప్రభుత్వం స్పందించి రహదారి సుందరీకరణ పనులు చేపట్టాలని కోరారు.
బోయిన్పల్లి విమానాశ్రయ రహదారిలో స్వచ్ఛభారత్
విమానాశ్రయం శంషాబాద్‌కు తరలివెళ్లిన తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్ రోడ్డు పరిసర ప్రాంతాలను విస్మరించారని అన్నారు. విమానాశ్రయ రహదారి పక్కన ఫుట్‌పాత్‌లు నిర్మించామని, ట్రాఫిక్ పోలీసుల సహకారంతో బారికేడ్లు ఉంచామన్నారు. రాబోయే రోజుల్లో వీధి దీపాలను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వం స్పందించి రహదారి మార్గాన్ని సుందరీకరణ చేయాల్సిన అవసరముందని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు రమణ కోరారు.