WATER PLUS TO GHMC: హైదరాబాద్‌కు స్వచ్ఛభారత్ మిషన్ వాటర్ ప్లస్ ధ్రువపత్రం - తెలంగాణ వార్తలు

12:40 August 20
WATER PLUS TO GHMC: హైదరాబాద్‌కు స్వచ్ఛభారత్ మిషన్ వాటర్ ప్లస్ ధ్రువపత్రం
హైదరాబాద్‌కు మరో జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. స్వచ్ఛమైన నీటి సరఫరాతో... వాటర్ ప్లస్(WATER PLUS) స్టేటస్‌ను కేంద్ర ప్రభుత్వం అందజేసింది. తెలంగాణలో(telangana) వాటర్ ప్లస్ ధ్రువపత్రం అందుకున్న తొలి నగరంగా హైదరాబాద్(hyderabad) నిలిచింది. హైదరాబాద్‌కు వాటర్ ప్లస్ గుర్తింపుపై మంత్రి కేటీఆర్(KTR) హర్షం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ వాసులకు ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. ఇప్పటికే నగరానికి ఓడీఎఫ్(ODF) ప్లస్ ప్లస్ గుర్తింపు ఉందన్న కేటీఆర్.... నగరాన్ని ఇంకా పరిశుభ్రంగా, ఆకుపచ్చగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు.
ఇదీ చదవండి:Union Minister Kishan reddy : 'ఏడేళ్లలో కేసీఆర్.. రాష్ట్రాన్ని దివాళా తీశారు'