తెలంగాణ

telangana

By

Published : Nov 11, 2020, 10:05 PM IST

ETV Bharat / state

ఎస్వీబీసీలో అటెండర్ తొలిగింపు.. కారణం అదే!

ఏపీ తిరుపతి ఎస్వీబీసీలో అటెండర్‌ను తొలగించినట్లు ప్రకటన విడుదలైంది. ఎస్వీబీసీ సీఈఓ పేరు మీద తితిదే ప్రకటన విడుదల చేసింది.

ఎస్వీబీసీలో అటెండర్ తొలగింపు.. కారణం అదే!
ఎస్వీబీసీలో అటెండర్ తొలగింపు.. కారణం అదే!

అటెండర్‌ను విధుల నుంచి తొలిగిస్తున్నట్లు తితిదే ప్రకటించింది. సెప్టెంబ‌ర్‌లో ఓ భక్తుడికి అశ్లీల వెబ్‌సైట్‌ లింక్‌ పెట్టినట్లు తితిదే గుర్తించింది. అశ్లీల వెబ్‌సైట్‌ లింక్‌ రావడం వల్ల తితిదే ఛైర్మన్‌, ఈఓలకు భక్తుడు ఫిర్యాదు చేశాడు. ఎస్వీబీసీ కార్యాలయంలోని కంప్యూటర్లను పరిశీలించినట్లు తితిదే వెల్లడించింది.

ఈఓ, ఛైర్మన్‌ ఆదేశాలతో 25 మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లతో కంప్యూటర్లు పరిశీలించారు. ముగ్గురు, నలుగురు సిబ్బంది అశ్లీల వెబ్‌సైట్లు వీక్షిస్తున్నట్లు వెల్లడైందని తితిదే ప్రకటించింది. పూర్తిస్థాయి పరిశీలన తర్వాత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఎస్వీబీసీ సీఈఓ తెలిపారు. తితిదే నిఘా, భద్రతా విభాగం పరిధిలోకి ఎస్వీబీసీ కార్యకలాపాలు ఉండేలా.. ఎస్వీబీసీ కంప్యూటర్లను తితిదే ఐటీ విభాగం పర్యవేక్షించేలా చర్యలు తీసుకోనున్నారు.

ఇదీ చదవండి:ఓటీటీలపై ఇక కేంద్రం పర్యవేక్షణ

ABOUT THE AUTHOR

...view details