హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలోని పలు బస్తీల్లో ఉంటున్న పశ్చిమ బంగ వలస కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. సువర్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 15 రోజులకు సరిపడ కిరాణా సామగ్రి వలస కూలీలకు అందజేశారు. బియ్యం, పప్పు, ఉల్లిగడ్డలు, కూరగాయలు తదితర వస్తువులను కార్మిక కుటుంబాలకు అందించారు. వలస కూలీలు లాక్డౌన్ను కఠినంగా పాటించాలని ఫౌండేషన్ ఛైర్మన్ రాజేశ్ బెస్త సూచించారు.
పశ్చిమ బంగ వలస కూలీలకు సువర్ణ ఫౌండేషన్ ఆపన్నహస్తం
హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలో ఉంటున్న పశ్చిమ బంగ వలస కూలీలకు సువర్ణ ఫౌండేషన్ నిత్యావసరాలను పంపిణీచేసి దాతృత్వాన్ని చాటుకుంది. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలెవరూ ఆకలితో అలమటించకుండా ఉండాలనే తమ వంతు సాయంగా కిరాణా సామగ్రిని పంపిణీ చేస్తున్నామని సంస్థ ఛైర్మన్ రాజేశ్ తెలిపారు.
పశ్చిమ బంగ వలస కూలీలకు సువర్ణ ఫౌండేషన్ ఆపన్నహస్తం
ఎట్టి పరిస్థితుల్లోనూ గుంపులు గుంపులుగా ఒకే చోట చేరకూడదని ఆయన కోరారు. ప్రభుత్వ నిబంధనలను ప్రజలంతా తప్పనిసరిగా అనుసరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కూలీల ఆకలి తీర్చడం కోసమే సామగ్రి పంపిణీ చేశామని సంస్థ ఛైర్మన్ రాజేశ్ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి:రైతులను అవమానించడం క్షమించరాని నేరం: ఈటల