హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిరుపేదలకు, అభాగ్యులకు సువర్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆహారాన్ని పంపిణీ చేశారు. బాగ్ లింగంపల్లి , చిక్కడ పల్లిలోని పలు బస్తీల్లో నిరుపేదలకు ఆహారాన్ని అందించారు. నగరంలోని పలు చోట్ల రోజుకు సుమారు 500 మందికి అన్నం, నీటి ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నట్లు ఫౌండేషన్ డైరెక్టర్ రాజేష్ బెస్త తెలిపారు.
వారికే ఆహారం...
చత్తీస్ గడ్ నుంచి వలస వచ్చిన కార్మికులకు ఉపాధి లేక ఆకలితో అల్లాడిపోతున్నారు. స్పందించిన సువర్ణ ఫౌండేషన్ పలు బస్తీల్లో పర్యటిస్తూ వారికి అన్న ప్రసాదం పంపిణీ చేసినట్లు రాజేశ్ వివరించారు. లాక్ డౌన్ సందర్భంగా స్వచ్ఛంద సంస్థల కృషి అమూల్యమైందని స్థానికులు ప్రశంసిస్తున్నారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి విజయ్ కుమార్ బెస్త, తదితరులు పాల్గొన్నారు.
నిరుపేదలకు అన్నదానం చేసిన సువర్ణ ఫౌండేషన్ ఇవీ చూడండి : రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తోన్న కరోనా