సువర్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నారాయణగూడ, హిమాయత్ నగర్ పలు ప్రాంతాల్లో చత్తీస్ ఘడ్ వలస కార్మికులకు నిత్యవసర సరకులు పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి కిలో కందిపప్పు, ఐదు కిలోల బియ్యం, మూడు కిలోల గోధుమ పిండి, ఒక కిలో నూనె, అర కిలో చింతపండు పంపిణీ చేశారు. సుమారు 15 రోజులకు సరిపడ సామగ్రిని అందించారు. వలస కార్మికులకు ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్నందునే ఈ సరకులు అందిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ రాజేష్ బెస్త తెలిపారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి విజయ్ కుమార్ బెస్త పాల్గొన్నారు.
చత్తీస్ ఘడ్ వలస కార్మికులకు నిత్యావసరాల పంపిణీ - FOOD DISTRIBUTION BY SUVARNA FOUNDATION
చత్తీస్ఘడ్ నుంచి వలస వచ్చి హైదరాబాద్లో స్థిరపడ్డ కార్మికులు లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి సువర్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసరాల సరకులు పంపిణీ చేశారు.
![చత్తీస్ ఘడ్ వలస కార్మికులకు నిత్యావసరాల పంపిణీ సువర్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసరాల సరకుల పంపిణీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6692326-thumbnail-3x2-foundation.jpg)
సువర్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసరాల సరకుల పంపిణీ
సువర్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసరాల సరకుల పంపిణీ