హైదరాబాద్ ముషీరాబాద్‌కు చెందిన సువర్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లో 200 కుటుంబాలకు నిత్యావసరాలను పంచారు. కార్యక్రమంలో బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మితోపాటు సినీ నటుడు తనిష్క్, సువర్ణ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాజేశ్ పాల్గొని సరుకులు అందజేశారు. లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంటి నేటి వరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పేదలకు సరుకులు అందిస్తున్నట్లు సువర్ణ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాజేశ్ తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు వేయి కుటుంబాలకు నిత్యావసరాలను అందించామన్నారు. పేదలకు సహాయం చేసేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని కార్పొరేటర్ విజయలక్ష్మి అన్నారు. ప్రతి ఒక్కరు లాక్‌డౌన్ పాటించి ఇంట్లోనే ఉండాలని... మీకు సహాయం చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయని నటుడు తనిష్క్ తెలిపారు.
పేదలకు నిత్యావసరాలు పంచిన సువర్ణ ఫౌండేషన్ - Hyderabad Banjarahills Essentials Distribution
లాక్‌డౌన్ కారణంగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు హైదరాబాద్ ముషీరాబాద్‌కు చెందిన సువర్ణ ఫౌండేషన్ సాయమందించింది. బంజారాహిల్స్‌లో దాదాపు 200 కుటుంబాలకు నిత్యావసరాలను అందించి బాసటగా నిలిచింది.
నిత్యావసరాల పంపిణీ