వర్ధమాన సినీ తారలు, మిస్ అందాల భామలు, క్రీడాకారులు ఒకే వేదికపై కనువిందు చేశారు. ర్యాంప్‌పై తమ అందచందాలతో అలరించారు. హైదరాబాద్ నోవాటెల్‌లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న సూత్ర ఫ్యాషన్ ఎగ్జిబిషన్ గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో వర్ధమాన సినీ కథానాయిక కవిత, క్రీడాకారిణి ఫరీదాతో పాటు పలువురు మోడల్స్ పాల్గొన్ని సందడి చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది.
ఈ నెల 12, 13 తేదీల్లో సూత్ర ఫ్యాషన్ ఎగ్జిబిషన్.. పోస్టర్ రిలీజ్ - Sutra Fashion Exhibition Wall Magazine Invention
హైదరాబాద్ నోవాటెల్‌లో ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహించనున్న సూత్ర ఫ్యాషన్ ఎగ్జిబిషన్ గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం వైభవంగా జరిగింది. వర్ధమాన సినీ కథానాయిక కవిత, క్రీడాకారిణి ఫరీదాతోపాటు పలువురు మోడల్స్ పాల్గొన్ని సందడి చేశారు.

ఈ నెల 12, 13 తేదీల్లో సూత్ర ఫ్యాషన్ ఎగ్జిబిషన్.. పోస్టర్ రిలీజ్
పలువురు మోడల్స్ తమ హంస నడకలతో మంత్రముగ్ధులను చేశారు. ఈ నెల 12, 13 తేదీల్లో హైటెక్ సిటీలో హెచ్‌ఐసీసీ సూత్ర ఫ్యాషన్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో దేశంలోని ప్రముఖ డిజైనర్లు తయారు చేసిన సరికొత్త ఉత్పత్తులను భాగ్యనగర ఫ్యాషన్ ప్రియులకు అందిస్తున్నట్లు వివరించారు.
ఇదీ చూడండి:తండ్రి లేని అమ్మాయికి పెళ్లి పీటలపైనే కల్యాణలక్ష్మి సాయం