తెలంగాణ

telangana

ETV Bharat / state

అనుమానంతో చంపేశాడు.. - women death

కట్టుకున్న భార్యను కిరాతకంగా గొంతు నులిమి హత్య చేసిన ఘటన జంటనగరాల్లో కలకలం సృష్టించింది.

మృతురాలు నసీన్​ బేగం

By

Published : Feb 13, 2019, 5:18 PM IST

Updated : Feb 13, 2019, 8:08 PM IST

మృతురాలు నసీన్​ బేగం
అనుమానం పెనుభూతమై ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఏకాంతంగా మాట్లాడుకుందామని భార్యను తీసుకెళ్లి చంపేశాడు. సికింద్రాబాద్‌లోని లాలాగూడకు చెందిన రఫీ, నసీన్‌ బేగంకు 2017లో నిఖా జరిగింది. రఫీ దుబాయిలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్యపై అనుమానం పెంచుకున్నాడు. నిన్న రాత్రి భార్య నసీన్‌బేగంతో కలిసి సికింద్రాబాద్‌లోని ఓ హోటల్‌ల్లో గది అద్దెకు తీసుకున్నాడు. వారి మధ్య మాటామాటా పెరగడంతో ఆమె మెడకు చున్నీ బిగించి హత్య చేశాడు.

హత్య అనంతరం పోలీసులకు ఫోన్ చేసి సమాచారమిచ్చి లొంగిపోయాడు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Last Updated : Feb 13, 2019, 8:08 PM IST

ABOUT THE AUTHOR

...view details