సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్థానిక ఎస్ఆర్టీ నగర్లో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో నీటి సంపులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సత్యనారాయణ హైదరాబాద్ నగరానికి వచ్చి సనత్ నగర్లో పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. రెండు సంవత్సరాలుగా ఎస్ఆర్టీ నగర్లో నిర్మాణంలో ఉన్న ఒక భవనంలో వాచ్మెన్గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే శుక్రవారం ఉదయం నుంచి అతడు కనపడకపోవడంతో భార్య రమణమ్మ, కూతురితో కలిసి వెతకడం ప్రారంభించారు. అతను విధులు నిర్వహిస్తున్న భవనం దగ్గరికి వెళ్లి చూడగా సంపులో అనుమానాస్పదంగా మృతి చెంది ఉన్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం తెలుపడంతో దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సత్యనారాయణ మరణంపై తమకు అనుమానాలు ఉన్నాయని భార్య రమణమ్మ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
సనత్నగర్లో సంపులో పడి వ్యక్తి మృతి - suspected death
సంపులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. సనత్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
సనత్ నగర్లో సంపులో పడి ఓ వ్యక్తి మృతి