అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భూదేవి నగర్లోని రైల్వే ట్రాక్ పక్కనే ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్న కరెంటు స్తంభానికి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
సికింద్రాబాద్ అల్వాల్లో రైల్వే ట్రాక్ పక్కనే ఉన్న కరెంట్ స్తంభానికి ఉరి వేసుకొని ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడి మరణానికి సంబంధించిన కారణాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. నిన్న రాత్రి సమయంలో ఈ ఘటన జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
ఇవీ చూడండి:కరీంనగర్ మేయర్ అభ్యర్థిని ఖరారు చేసిన తెరాస