తెలంగాణ

telangana

ETV Bharat / state

ధరణి ఫోర్టల్​లో ఆస్తుల వివరాలు నమోదు చేసేందుకు సర్వే - Dharani Portal Latest News

పటాన్​చెరు సర్కిల్​ పరిధిలో ఇళ్ల యజమానుల వివరాలు ధరణి పోర్టల్​లో నమోదు చేసేందుకు సర్వే నిర్వహిస్తున్నారు. చరవాణి సహాయంతో ఆరు బృందాలు పదిమంది సభ్యులు చొప్పున ఈ సర్వేలో నమోదు చేస్తున్నారు.

Survey to enter details in Dharani Portal
ధరణి ఫోర్టల్​లో ఆస్తుల వివరాలు నమోదు చేసేందుకు సర్వే

By

Published : Oct 3, 2020, 4:58 PM IST

గ్రేటర్​ హైదరాబాద్​ శివారు పటాన్​చెరు సర్కిల్​ పరిధిలో ఇళ్ల యజమానుల వివరాలు ధరణి పోర్టల్​లో నమోదు చేసేందుకు గ్రేటర్ సిబ్బంది సర్వే నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు గ్రేటర్ సర్కిల్లో ఉన్న 2018 మంది ఇళ్ల యజమానులు ఆస్తుల వివరాలను ధరణి పోర్టల్​లో నమోదు చేసేందుకు సర్వే చేస్తున్నారు..

పటాన్​చెరు రామచంద్రపురం భారతి నగర్ డివిజన్లలో ఇళ్ల యజమానులు వివరాలను తీసుకొని చరవాణి సహాయంతో ఆరు బృందాలు పదిమంది సభ్యులు చొప్పున ఈ సర్వేలో నమోదు చేస్తున్నారు. అక్టోబర్ 10 లోపు ఈ వివరాలు నమోదు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఉప కమిషనర్ బాలయ్య తెలిపారు.

ఇదీ చదవండి:మంత్రి ఐనా ఊరిలో సామాన్యుడే... పన్ను కట్టిన ఎర్రబెల్లి

ABOUT THE AUTHOR

...view details