తెలంగాణ

telangana

ETV Bharat / state

భారీ సైజులో చిలకడదుంప..ఆశ్యర్యపోతున్న స్థానికులు - sweet potato in huge size

సాధారణంగా చిలకడదుంపలు కిలోకు అయిదారు తూగుతాయి. బాగా పెద్ద సైజ్​వి అయితే ఒక్కొకటి కేజీ బరువు ఉండొచ్చు. కానీ ఈ చిలకడదుంప మాత్రం ఏకంగా ఆరుకిలోలు తూగింది. ఈ దుంపను చూసిన స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

sweet potato
చిలకడదుంప

By

Published : Apr 17, 2021, 10:36 PM IST

ఏపీలోని కృష్ణా జిల్లా మోపిదేవి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన రైతు గంజాల స్వాములు.. తన మామిడితోటలో అంతర్ పంటగా చిలకడదుంపను సాగు చేశారు. పంట చేతికొచ్చే సమయం కావటంతో దుంపలను తవ్వించగా.. ఒక చిలకడదుంప భారీ సైజులో బయటపడింది.

దీనిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దుంపను తూకం వేయగా.. ఆరు కేజీలు ఉన్నట్లు తేలింది. భారీ సైజులో చిలకడదుంప పండటంతో రైతు స్వాములు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీచదవండి:ప్రతిధ్వని: మహిళలే లక్ష్యంగా సైబర్ నేరాలు

ABOUT THE AUTHOR

...view details