గుంటూరు జీజీహెచ్‌లో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల విషయంలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ అధికారులు అచ్చెన్నాయుడును ఆరు రోజుల క్రితం అరెస్టు చేశారు. అంతకు రెండు రోజుల ముందే శస్త్ర చికిత్స చేయించుకున్న అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కోర్టు ఆయనను జీజీహెచ్‌కు తరలించాలని ఆదేశించింది.
ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి శస్త్ర చికిత్స పూర్తి
ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలో అరెస్టయిన ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి గుంటూరు జీజీహెచ్‌లో వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు వెల్లడించారు.
ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని విజయవాడకు తీసుకొచ్చే క్రమంలో పోలీసులు దాదాపు 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేయించారు. దీంతో ఆయన గాయం తిరగబెట్టింది. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. రక్తస్రావం సమస్య ఉండటం వల్ల వైద్యులు ఆయనకు జూన్ 17 బుధవారం నాడు శస్త్రచికిత్స చేశారు. ఇన్ఫెక్షన్ కారణంగా సమస్య తలెత్తినట్లు వైద్యులు తెలిపారు. శస్త్ర చికిత్స కోసం ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే ఆపరేషన్ చేశారు. ఆయన ఐదు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.
ఇదీ చదవండి:చైనా-భారత్ వివాదం: ఈటీవీ భారత్ కథనాలు