నాటకం అనగానే గుర్తుకువచ్చే పేరు సురభి. ఆడవారి వేషాలు మగవారు వేసే కాలంలో, నాటక రంగానికి మొట్టమొదటి నటిని ఇచ్చిన కళామతల్లి సురభి. నాటక సమాజాలు మన తెలుగు రాష్ట్రాలలో ఎన్నో ఉన్నాయి. అవి ఎంతో మంది కళాకారులను అందించాయి. 135 ఏళ్లుగా కళామతల్లిని ఆరాధిస్తూ... నాటకం అంటే వారి పేరే జ్ఞాపకం వచ్చేలా గుర్తింపు పొందింది. విజయదశమిని పురస్కరించుకొని ప్రత్యేక నాటకాలు ఏర్పాటు చేసినట్లు సురభి కళాకారులు తెలిపారు.
పండుగ రోజు 'ఉదయం పూజ చేసుకొని, మధ్యాహ్నం కుటుంబసమేతంగా పిండివంటలతో భోజనం చేసి, చక్కగా మీ చిన్నారులకు జై పాతాళ భైరవి నాటకం గురించి చెప్పండి... చూపించండి' అని విజ్ఞప్తి చేస్తున్నారు. వారి వెబ్సైట్ను క్లిక్ చేసి సురభి నాటకం చూడవచ్చని సూచించారు.