సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ విశాఖజిల్లాలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ వేసిన పిటిషన్‌ను జస్టిస్ లలిత్ ధర్మాసనం విచారించింది. ప్లాంట్ మూసివేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంను ఆశ్రయించిన ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్‌లోకి వెళ్లేందుకు అనుమతి కోరింది. అత్యవసర పరిస్థితుల్లో ప్లాంట్‌ని సందర్శించేందుకు సర్వోన్నత న్యాయస్థానం ఎల్జీ పాలిమర్స్‌కు అవకాశం ఇచ్చింది. 30 మంది కంపెనీ నిపుణుల పేర్లను జిల్లా కలెక్టర్‌కు ఇవ్వాలని ఆదేశించింది.
అత్యవసర పరిస్థితిలో ప్లాంట్ సందర్శించేందుకు సుప్రీం అనుమతి
విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్‌ను అత్యవసర పరిస్థితిలో సందర్శించేందుకు సుప్రీంకోర్టు అవకాశం ఇచ్చింది. ఈ మేరకు 30 మంది కంపెనీ నిపుణుల పేర్లను కలెక్టర్‌కు ఇవ్వాలని ఆదేశించింది.
Supreme court
ఏడు కమిటీల్లో ఏ కమిటీ ముందు హాజరు కావాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ ధర్మాసనం ముందు వ్యాఖ్యానించింది. అన్ని అంశాలను హైకోర్టులో వాదించేందుకు సుప్రీం అవకాశం ఇచ్చింది. జాతీయ హరిత ట్రైబ్యునల్ లేదా హైకోర్టు వీటిపై పూర్తిగా దర్యాప్తు చేస్తాయని స్పష్టం చేసింది. తొలి పిటిషన్‌తో కలిపి వాదనలు జూన్ 8న వింటామని.... ధర్మాసనం స్పష్టం చేసింది
ఇవీ చదవండి