దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే న్యాయ కమిషన్ ఏర్పాటు చేశామని.. విచారణ కోసం నిబంధనల రూపకల్పన చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బొబ్డే పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌ను సవాలు చేస్తూ.. న్యాయవాదులు జి.ఎస్.మణి, ప్రదీప్, ఎంఎల్ శర్మ, ముకేశ్ దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. కమిషన్ విచారణ జరుపుతోందని స్పష్టం చేసింది.
'విచారణ కోసం నిబంధనల రూపకల్పన చేస్తున్నాం'
చటాన్‌పల్లి వద్ద జరిగిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను సవాల్ చేస్తూ.. న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారించింది. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా పడింది.
దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీం
దిశ ఘటనలో మీడియా ప్రసారాలపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన నోటీసులను న్యాయవాది ఎంఎల్ శర్మ ప్రస్తావించగా.. మాట్లాడే హక్కు మీడియాకు ఉందని, కానీ మీడియా ప్రత్యేకించి సదరు వ్యక్తి తప్పు అని చెప్పేలా ఉండకూడదని అభిప్రాయపడ్డారు. ఈ కేసు తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేస్తున్నట్లు సీజేఐ తెలిపారు.
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై గులాబీ గురి