తెలంగాణ

telangana

ETV Bharat / state

హీరా గోల్డ్ కేసులో అఫిడవిట్ దాఖలుకు రెండు వారాల గడువు - హీరా గోల్డ్ కేసు తాజా వార్తలు

హీరా గోల్డ్​ కేసులో అఫిడవిట్ దాఖలు చేసేందుకు మరో రెండు వారాల గడువు కావాలని కేంద్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. వివిధ కారణలతో అఫిడవిట్ దాఖలు చేయలేకపోయామని సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు విన్నవించారు.

హీరా గోల్డ్ కేసులో అఫిడవిట్ దాఖలుకు రెండు వారాల గడువు
హీరా గోల్డ్ కేసులో అఫిడవిట్ దాఖలుకు రెండు వారాల గడువు

By

Published : Nov 18, 2020, 10:48 PM IST

హీరా గోల్డ్​ కేసులో అఫిడవిట్ దాఖలు చేసేందుకు మరో రెండు వారాల గడువు కావాలని కేంద్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. హీరా గోల్డ్ కేసులో నౌహీరా బెయిల్ పిటిషన్, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ కార్యాలయంతో పాటు ఐపీసీ ప్రకారం కూడా దర్యాప్తు జరపాలన్న తెలంగాణ ప్రభుత్వ పిటిషన్లపై జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం విచారణ జరిపింది.

కేసు దర్యాప్తు పురోగతిని తెలియజేయాలన్న గత విచారణలో సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరగా.. వివిధ కారణలతో అఫిడవిట్ దాఖలు చేయలేకపోయామని సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు విన్నవించారు. మరికొంత గడువు కావాలని ఎస్​జీ కోరగా.. అందుకు అంగీకరించిన ధర్మాసనం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ఇదీ చదవండి:హీరాగోల్డ్ కేసులో దర్యాప్తు వేగవంతం.. ఆస్తుల స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details