తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా పరీక్షలపై ప్రభుత్వానికి ఊరట.. స్టే విధించిన సుప్రీంకోర్టు

కరోనా నిర్థారణ పరీక్షల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించించింది. ఆస్పత్రుల్లో మరణించిన వారికి కూడా కరోనా పరీక్షలు చేయాలని హైకోర్టు ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది.

supreme-court-stay-on-ts-high-court-orders
తెలంగాణలో కరోనా పరీక్షలపై సుప్రీం స్టే

By

Published : Jun 17, 2020, 8:40 PM IST

తెలంగాణలో కరోనా పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఆసుపత్రుల్లో మరణించిన వారికి కూడా కరోనా పరీక్షలు చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. అందరికీ కరోనా పరీక్షలు చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. కేంద్ర ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్‌ నిబంధనల మేరకే కరోనా పరీక్షలు చేస్తున్నామని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం వాదనలు పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని ధర్మాసనం... హైకోర్టు ఆదేశాలపై స్టే మంజూరు చేస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ఇవీ చూడండి:కరోనాపై పోరులో భారత్​కు భారీ రుణ సాయం

ABOUT THE AUTHOR

...view details