కరోనా పరీక్షల అంశంలో హైకోర్టు ఇచ్చిన కోర్టు ధిక్కరణ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. తమ ఆదేశాలు పాటించలేదని... ప్రజారోగ్య సంచాలకుడికి హైకోర్టు... కోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట - సుప్రీంకోర్టు వార్తలు
కరోనా పరీక్షలపై తమ ఆదేశాలు పాటించలేదని హైకోర్టు ఇచ్చిన కోర్టు ధిక్కరణ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రోజూ 50 వేల పరీక్షలు నిర్వహించడం కష్టమని సుప్రీంకు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
కరోనా కట్టడికి అవసరమైనన్ని పరీక్షలు ప్రభుత్వం చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రోజూ 50 వేల పరీక్షల నిర్వహణ కష్టమని సుప్రీంకు తెలుపగా... హైకోర్టు ఆదేశాలపై అత్యున్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది.
ఇదీ చూడండి:పోలీస్‌శాఖలో 20వేల పోస్టులు భర్తీ చేస్తాం: హోంమంత్రి