తప్పుడు వార్తల ప్రచారాన్ని నియంత్రించాలని కేంద్ర హోంశాఖకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అసత్య వార్త ప్రసార, ప్రచారాలతో ప్రజలు మానసిక క్షోభకు గురవుతున్నారని సుప్రీం కోర్టు ఆభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ బల్లా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. అవాస్తవ వార్తలను కట్టడి చేసేందుకు, అలాంటి వార్తలు విరివిగా ప్రచారంలోకి రాకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఆ లేఖలో కోరారు.
వెబ్‌పోర్టల్
ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకు ఒక వెబ్‌పోర్టల్‌ను ప్రభుత్వం రూపొందిస్తున్నట్టు హోం శాఖ పేర్కొంది. ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలను కోరింది.