జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల విషయంలో సుప్రీం ఆదేశాలను రాష్ట్ర ఎన్నికల సంఘం అమలు చేయాలని సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి కోరారు. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులకు నేర చరిత్ర ఉంటే 48 గంటల్లో ప్రచురించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని గుర్తుచేశారు. ఈ నిబంధనను ఆయా పార్టీలు అమలుచేసేలా రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని పద్మనాభరెడ్డి కోరారు.
గ్రేటర్ ఎన్నికల్లో సుప్రీం ఆదేశాలు అమలుచేయాలి: సుపరిపాలన వేదిక
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సుప్రీం ఆదేశాలను రాష్ట్ర ఎన్నికల సంఘం అమలుచేయాలని సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి కోరారు. అభ్యర్థులకు నేరచరిత్ర ఉంటే 48 గంటల్లో ప్రచురించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించినట్లు గుర్తుచేశారు.
గ్రేటర్ ఎన్నికల్లో సుప్రీం ఆదేశాలు అమలుచేయాలి: సుపరిపాలన వేదిక
2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పలు పార్టీల నుంచి 72 మంది నేరచరితులు బరిలో దిగారన్నారు. ఈసారి అంతకంటే ఎక్కువ మందికే రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చే అవకాశం ఉందని పద్మనాభరెడ్డి అభిప్రాయపడ్డారు. ధనబలం, కండ బలంతో అభ్యర్థులు గెలవాలని చూస్తున్నారని.. ఓటర్లు ఎలాంటి అభ్యర్థికి ఓటు వేస్తున్నామో తెలుసుకునే అవకాశం ఉండాలని పద్మనాభరెడ్డి తెలిపారు.
ఇవీచూడండి:జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలు ఇవే..