తమ భూభాగంలోకి వచ్చే మూడు పంచాయతీల పేర్లు మార్చి.. అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. గంజాయ్పదర్ను గంజాయ్భద్రగా, ఫట్టు సెనరీను పట్టుచెన్నూరుగా... ఫగు సెనరీను పగులుచెన్నూరుగా మార్చారని పిటిషన్లో పేర్కొంది. ఆ మూడు పంచాయతీల్లో గతంలో తాము ఎన్నికలు నిర్వహించినట్లు ఒడిశా స్పష్టం చేసింది.
ఏపీ సర్కార్ మీద ఒడిశా వేసిన పిటిషన్పై రేపు అత్యవసర విచారణ - odisha complaint on ap news
కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా.. తమ భూభాగంలో ఏపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించారని ఒడిశా ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
Delhi_Supreme on Odisha Petetion_Panchayaths_Taza
కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఎన్నికలు నిర్వహించారని అందులో ఆరోపించింది. సీఎస్, ఎస్ఈసీ నుంచి సంజాయిషీ కోరి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని... ఒడిశా తరఫు న్యాయవాది వికాస్ సింగ్ కోరారు. వాదనలు విన్న సీజేఐ బోబ్డే ధర్మాసనం.. రేపు అత్యవసర విచారణ జరిపేందుకు అంగీకరించింది.