తెలంగాణ

telangana

ETV Bharat / state

నిమ్మగడ్డ కేసులో ఏపీ హైకోర్టు తీర్పుపై స్టేకు సుప్రీం నిరాకరణ

ఏపీ హైకోర్టు తీర్పుపై స్టేకు నిరాకరించిన సుప్రీం కోర్టు... రాజ్యాంగ వ్యవస్థలతో ఆటలు తగవని ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికింది. ఏపీ ఎన్నికల కమిషనర్​పై ఆర్డినెన్స్‌ వెనక ప్రభుత్వ ఉద్దేశాలు సంతృప్తికరంగా లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇలాంటి ఆర్డినెన్స్ ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించింది. రాజ్యాంగబద్ధ పదవులు ఉన్నవారితో ఆటలు ఆడుకోవద్దని పేర్కొంది.

supreme-court-on-nimmagadda-ramesh-kumar-case
నిమ్మగడ్డ కేసులో ఏపీ హైకోర్టు తీర్పుపై స్టేకు సుప్రీం నిరాకరణ

By

Published : Jun 10, 2020, 2:23 PM IST

నిమ్మగడ్డ కేసులో ఏపీ హైకోర్టు తీర్పుపై స్టేకు సుప్రీం నిరాకరణ

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజ్యాంగ వ్యవస్థలతో ఆడుకోవడం మంచిది కాదని.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషనర్​​ పదవీ కాలాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఆర్టినెన్స్​ను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్​ చేస్తూ.. సుప్రీంలో ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్​పై సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేసింది. ఆర్డినెన్స్ తీసుకురావడం వెనక ప్రభుత్వ ఉద్దేశాలు స్పష్టంగా తెలుస్తున్నాయని ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగ పదవిలో ఉన్నవారిని ఎలా తొలగిస్తారని ప్రశ్నించింది.

  • ఉత్తర్వులేం ఇవ్వట్లేదు..
    ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, రాకేష్ ద్వివేది వాదనలు వినిపించారు. ఏపీ హైకోర్టు తీర్పు అంశాలు తప్పని వాదించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇప్పుడెలాంటి ఉత్తర్వులు ఇవ్వట్లేదన్న ధర్మాసనం.. మొత్తం వ్యవహారంపై సవివరంగా విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ప్రతివాదులకు నోటీసులిచ్చింది. రెండు వారాల తర్వాత విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details