Supreme Court on MLC Kavitha Petition in Deli Liquor Policy : సుప్రీంకోర్టులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha)కు ఊరట లభించింది. దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు(Delhi liquor Scam)లో సుప్రీంకోర్టు ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. నవంబరు 20వ తేదీన విచారణ చేపడతామని తెలిపింది. అక్టోబరు 18న మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA)కు సంబంధించిన కేసుల ప్రత్యేక విచారణ జరగనున్న నేపథ్యంలో.. వాటి విచారణ పూర్తైన తర్వాతే దిల్లీ లిక్కర్ స్కామ్‌ను పరిశీలిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.
SC Postpones Kavitha Petition in Delhi Liquor Scam : అప్పటి వరకు ప్రస్తుతం అమల్లో ఉన్న మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం తెలిపింది. ఈ నెల 15వ తేదీ ఈడీకి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. నవంబర్ 20వ తేదీ వరకు ఆ ఉత్తర్వులే కొనసాగుతాయని తాజాగా స్పష్టం చేసింది. మరోవైపు నవంబర్ 20వ తేదీ వరకు కవితను విచారణకు పిలవబోమని ఈడీ తరఫు న్యాయవాది ఎఎస్‌జీ రాజు ధర్మాసనానికి వివరించారు.
సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు సమన్లు ఇవ్వొద్దని ఈడీకి ఈనెల 15న మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం ఇచ్చింది. అప్పటివరకు అవే ఉత్తర్వులు కొనసాగుతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మహిళల విచారణలో తగిన ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్‌తో కూడిన ధర్మాసనం వివరించింది.