ఇంజినీరింగ్ ఫీజుల నిర్ణయాధికారం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రుసుముల నియంత్రణ కమిటీకే ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వాసవి, శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాలల ఫీజుల వ్యవహారంలో సోమవారం తీర్పు వెలువరించిన ధర్మాసనం.. కమిటీ ఎంత నిర్ణయిస్తే కళాశాలలు అంతే వసూలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అధిక ఫీజులు వసూలు చేస్తునన్నారంటూ వాసవి కళాశాల పేరేంట్స్ అసోషియేషన్, తెలంగాణ ప్రభుత్వం పిటిషన్లు దాఖలు చేయగా.. జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం సుదీర్ఘ వాదనల తర్వాత గత ఏప్రిల్ 10న తీర్పును రిజర్వ్ చేసింది. సోమవారం జస్టిస్ నవీన్ సిన్హా తీర్పు కాపీని చదివి వినిపించారు. వాసవి, శ్రీనిధి కళాశాలల ఫీజుల విషయంలో రాష్ట్ర హైకోర్టు పరిధిదాటి వ్యవహరించిందని అభిప్రాయపడ్డ సుప్రీంకోర్టు.. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది.
విద్యార్థుల ఫీజును తిరిగి చెల్లించాలి:సుప్రీం కోర్టు - vasavi enngineering college
ఇంజినీరింగ్ కళాశాలల ఫీజుల అంశంలో వాసవి,శ్రీనిధి కళాశాలలకు సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఫీజుల నియంత్రణ కమిటీకే నిర్ణయాధికారం ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇప్పటికే అధిక ఫీజులు చెల్లించిన విద్యార్థులకు... వారు చెల్లించిన అధికమొత్తాన్ని తిరిగిఇవ్వాలని ధర్మాసనం మార్గదర్శకాలను ఇచ్చింది.
'వారి ఫీజును తిరిగి చెల్లించాలి'
వాసవి కళాశాల ఫీజులను టీఏఎఫ్ఆర్సీ రూ.85 వేలుగా నిర్ణయించగా.. కమిటీ నిర్ణయంపై వాసవి యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. విచారణలో ఫీజుపై సమీక్షించిన కమిటీ రూ.97 వేల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనిపై కళాశాల యాజమాన్యం ప్రతిపాదించిన లక్షా 60 వేల రూపాయలనే ఫీజు నిర్ణయిస్తూ హైకోర్టు తీర్పును వెలువరించింది. ఈ తీర్పును ధర్మాసనం పక్కన పెట్టింది. ఇప్పటికే అధిక ఫీజులు చెల్లించిన విద్యార్థులకు... వారు చెల్లించిన అధికమొత్తాన్ని తిరిగిఇవ్వాలని మార్గదర్శకాలను ఇచ్చింది.
ఇదీ చూడండి: పేదల కోటా వ్యతిరేక వ్యాజ్యాలపై విచారణ వాయిదా