తెలంగాణ, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసిన సుప్రీంకోర్టు - Supreme Court Notices to Telangana Govt
12:04 January 09
తెలంగాణ, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసిన సుప్రీంకోర్టు
రాష్ట్ర విభజన తర్వాత ఆస్తుల పంపిణీపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణకు తెలంగాణ, కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులు హాజరుకాలేదు. దీంతో తెలంగాణ, కేంద్ర ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులు జారీచేసింది. అదే విధంగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగానే కౌంటర్‌పై రీజాయిండర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. ఆస్తుల విభజన సక్రమంగా జరగక ఆర్థికంగా నష్టపోయామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. ఆస్తుల విభజన న్యాయబద్ధంగా జరిపేలా ఆదేశాలివ్వాలని న్యాయస్థానానికి విన్నవించింది. తదుపరి విచారణను సుప్రీం కోర్టు ఆరు వారాలకు వాయిదా వేసింది.
ఇవీ చదవండి:తెలంగాణ ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ ఓ అద్భుతం : కేటీఆర్
గల్ఫ్ 'డ్రైవర్ల' మధ్య లవ్.. లారీ నడుపుతూ యువకుడిని అక్కడికి తీసుకెళ్లిన యువతి!