సుప్రీంకోర్టులో ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ జరిగింది. తమ పంచాయతీలకు ఏపీ ఎన్నికలు నిర్వహిస్తోందని.. అందులో 3 పంచాయతీల పేర్లు మార్చారని పేర్కొంది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన జస్టిస్ ఎ.ఎం.ఖాన్ విల్కర్ ధర్మాసనం... ఏపీ తరఫు న్యాయవాదికి పిటిషన్ కాపీ అందించాలని సూచించింది.
'ఆ మూడు పంచాయతీలపై వచ్చే వారంలోపు సమాధానమివ్వండి' - ap news
ఏపీ పంచాయతీ ఎన్నికలపై ఒడిశా ప్రభుత్వం సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. ఏపీ తరఫు న్యాయవాదికి పిటిషన్ కాపీ అందించాలని సూచించింది. వచ్చే వారంలోపు సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

'ఆ మూడు పంచాయతీలపై వచ్చే వారంలోపు సమాధానమివ్వండి'
పిటిషన్‌పై వచ్చే వారంలోపు సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. శనివారం జరిగే రెండో విడత ఎన్నికలపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.
ఇదీ చదవండి:ఆదాయం ఎక్కువ.. అన్నదానం తక్కువ