తెలంగాణ

telangana

ETV Bharat / state

భారతీ సిమెంట్స్​ ఆస్తులపై సుప్రీం కోర్టులో విచారణ.. ఏం చెప్పిందంటే? - సుప్రీం కోర్టు

Supreme Court hearing on Bharti Cements assets: ఈడీ జప్తు చేసిన భారతీ సిమెంట్స్​​ ఆస్తుల నుంచి ఎన్ని ఫిక్స్​డ్​ డిపాజిట్లను.. ఈడీ నగదుగా మార్చుకుందో తెలపాలాని సుప్రీంకోర్టు, భారతీ సిమెంట్స్​ను ఆదేశించింది. వారం రోజుల్లో ఈ వివరాలపై అఫిడవిట్​ దాఖలు చేయాలని భారతీ సిమెంట్స్​ను ఆదేశించింది.

Supreme Court
Supreme Court

By

Published : Feb 7, 2023, 11:49 AM IST

Supreme Court hearing on Bharti Cements assets: జప్తు చేసిన ఆస్తుల నుంచి ఎన్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఈడీ నగదుగా మార్చుకున్నదో చెప్పాలని.. సుప్రీంకోర్టు భారతీ సిమెంట్స్‌ను ఆదేశించింది. ముఖ్యమంత్రి జగన్‌ అక్రమాస్తుల కేసులో.. భారతీ సిమెంట్స్‌కు చెందిన స్థిర, చరాస్తులను దర్యాప్తులో భాగంగా ఈడీ జప్తు చేసింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. భారతీ సిమెంట్స్‌కు చెందిన పలు స్థిరాస్తులను జప్తు నుంచి విడుదల చేసి.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను అటాచ్ చేయాలని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

దీనిపై ఈడీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. జస్టిస్ రామసుబ్రహ్మణ్యంస జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్​తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. బ్యాంకు గ్యారెంటీలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై భారతీ సిమెంట్స్‌కు అనుకూలంగా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌, హైకోర్టు ఇచ్చిన తీర్పులను నిలుపుదల చేయాలని ఈడీ విజ్ఞప్తి చేసింది. బ్యాంకు గ్యారంటీ తీసుకుని ఆస్తులు, ఎఫ్‌డీలను విడుదల చేయాలని.. హైకోర్టు ఆదేశాల్లో పేర్కొందని, భారతీ సిమెంట్స్‌ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

బ్యాంకు హామీలు తీసుకున్న తర్వాత కూడా 150 కోట్ల రూపాయల విలువైన ఎఫ్‌డీలను ఈడీ నగదు చేసుకున్నట్లు చెప్పారు. దీనిపై స్పందించిన ఈడీ తరఫు న్యాయవాది.. ఎఫ్‌డీలను ఎన్‌క్యాష్‌ చేసుకోలేదని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం ఎంత మేరకు ఎఫ్‌డీలను నగదు చేసుకున్నారో వివరాలతో.. వారం రోజుల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని భారతీ సిమెంట్స్‌ను ఆదేశించింది.

కాగా భారతీ సిమెంట్స్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌ని తాము కూడా పరిశీలించి తగిన సమాధానం ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని.. ఈడీ తరఫు న్యాయవాది కోరగా, ధర్మాసనం అందుకు ఆమోదం తెలిపింది. భారతీ సిమెంట్స్‌ అఫిడవిట్‌ దాఖలు చేశాక తదుపరి విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details