జనాభా గణన 2021లో బీసీలను కులాల వారీగా లెక్కించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్కు చెందిన మల్లేశ్ యాదవ్, ఆళ్ల రామకృష్ణ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా... సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది జీఎస్ మణి.. ఇదే అంశంపై ఇప్పటికే దాఖలైన పిటిషన్లో కోర్టు నోటీసులు జారీ చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
బీసీల కులాల వారీ లెక్కింపుపై సుప్రీంలో విచారణ
బీసీలను కులాల వారీగా లెక్కించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్కు చెందిన మల్లేశ్ యాదవ్, ఆళ్ల రామకృష్ణ పిటిషన్ వేయగా... సర్వోన్నత ధర్మాసనం విచారణ చేపట్టింది.
బీసీల కులాల వారీ లెక్కింపుపై సుప్రీంలో విచారణ
ఈ కేసులో కూడా ప్రతివాదులైన కేంద్ర హోంశాఖ, కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖతో పాటు బీసీ జాతీయ కమిషన్కు నోటీసులు జారీ చేస్తున్నట్లు సీజేఐ తెలిపారు. తదుపరి విచారణ తేదీని సుప్రీంకోర్టు ఖరారు చేయలేదు. గతేడాది నవంబర్లోనే జనాభా గణన 2021లో బీసీలను కులాల వారీగా లెక్కించాలని బీసీ నేత ఆర్.కృష్ణయ్య సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.