తెలంగాణ

telangana

ETV Bharat / state

అమరావతి పిటిషన్లపై సుప్రీం విచారణ.. మరో ధర్మాసనానికి పంపాలన్న సీజేఐ - Supreme Court on Amaravati Petitions

Supreme Court on Amaravati Petitions : ఏపీ రాజధాని అమరావతి వ్యవహారంపై సుప్రీం కోర్టు ఇవాళ విచారణ జరిపింది. ప్రభుత్వం, అమరావతి రైతులు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై విచారణకు సీజేఐ యు.యు. లలిత్ విముఖత చూపారు. ఈ పిటిషన్ల విచారణను వేరే ధర్మాసనానికి బదిలీ చేయాలని ఆదేశించారు.

Supreme Court on Amaravati Petitions
Supreme Court on Amaravati Petitions

By

Published : Nov 1, 2022, 2:01 PM IST

Supreme Court on Amaravati Petitions : ఏపీ రాజధాని అమరావతి వ్యవహారంపై సుప్రీం కోర్టులో నేడు విచారణ జరిగింది. ప్రభుత్వం, అమరావతి రైతులు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై విచారణకు సీజేఐ జస్టిస్‌ యు.యు.లలిత్‌ విముఖత చూపారు. తాను సభ్యుడిగా లేని మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని ఆదేశించారు. అమరావతి రాజధానిగా కొనసాగించాలన్న హైకోర్టు తీర్పును.. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌లో సుప్రీం కోర్టులో సవాల్‌ చేసింది. హైకోర్టు తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.

Supreme Court on AP Capital Petitions : సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు. లలిత్‌ న్యాయ సలహాలు ఇచ్చిన నేపథ్యంలో రాజధాని అమరావతి పిటిషన్ల విచారణకు విముఖత చూపినట్లు హైకోర్టు న్యాయవాది ఉమేశ్​ చంద్ర తెలిపారు. తాను సభ్యుడిగా లేని మరో ధర్మాసనానికి పంపాలని సీజేఐ ఆదేశాలిచ్చినట్లు వెల్లడించారు.

సీఆర్డీఏ చట్టం, ఇతర అంశాలకు గతంలో జస్టిస్‌ లలిత్‌ న్యాయసలహాలు ఇచ్చారని న్యాయవాది నర్రా శ్రీనివాస్‌ తెలిపారు. న్యాయసలహాలు ఇచ్చారని రైతుల తరఫు లాయర్లు సీజేఐకు గుర్తుచేశారని.. ఈ నేపథ్యంలో తాను సభ్యుడిగా లేని మరో ధర్మాసనానికి పంపాలని సీజేఐ ఆదేశాలిచ్చినట్లు వెల్లడించారు. కొత్త సీజేఐ వచ్చేవరకు బెంచ్‌కు వచ్చే అవకాశం ఉండకపోవచ్చని సమాచారం.

ABOUT THE AUTHOR

...view details