తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏబీ సస్పెన్షన్​ కేసులో ఏపీ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే

ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి ఆదేశాల వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని తెలిపింది. ఈ విచారణలో భాగంగా ఆయనకు నోటీసులు జారీ చేసిన దేశ అత్యున్నత న్యాయస్థానం... 3వారాల్లోపు సమాధానం చెప్పాలని ఆదేశించింది.

By

Published : Nov 26, 2020, 3:08 PM IST

sc
ఏబీ సస్పెన్షన్​ కేసులో ఏపీ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే

ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ప్రభుత్వం వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ ఎ.ఎం.ఖాన్ విల్కర్, జస్టిస్ అజయ్ రోస్తగి ధర్మాసనం విచారణ చేపట్టింది. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చింది. తదుపరి ఆదేశాల వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని జస్టిస్ ఖాన్ విల్కర్ తెలిపారు.

ఈ కేసులో ఏబీ వెంకటేశ్వరరావుకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఛార్జిషీట్‌ ఏబీ వెంకటేశ్వరరావుకు ఎందుకు సమర్పించలేదని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. ఛార్జిషీట్ ఇవ్వకుండా సుప్రీంకోర్టులో కేసు ఎందుకు వేశారని నిలదీసింది. ఛార్జిషీట్‌ను ఏబీ వెంకటేశ్వరరావుకు సమర్పించాలని ప్రభుత్వానికి ధర్మాసనం సూచించింది.

ఇదీ చదవండి:రైతు ఆత్మహత్య.. పంట నష్టంపై కేసీఆర్​కు వీడియో

ABOUT THE AUTHOR

...view details