Supreme court permits Palamuru Rangareddy project works : పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 7.15 టీఎంసీల వరకు పనులు కొనసాగించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. పర్యావరణ అనుమతులు 7.15 టీఎంసీల ఉపయోగించుకోవటానికి సర్వోన్నత న్యాయస్థానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించుకు కోవాలని స్పష్టం చేసింది.
ప్రజలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొకుండా.. ఇబ్బందులకు గురికాకూడదన్న ఉద్దేశ్యంతో ఈ అవకాశం కల్పిస్తున్నట్లు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఈ కేసులో మెరిట్స్ ఆధారంగానే తగిన నిర్ణయాలు ఉంటాయని ధర్మాసనం సూచించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారని జాతీయ హరిత ట్రైబ్యునల్ విధించిన రూ. 500 కోట్ల జరిమానాపై మాత్రం అత్యున్నత న్యాయస్థానంలోని ధర్మాసనం స్టే విధించింది.
అయితే పాలమూరు-రంగారెడ్డిపై ఎన్జీటి జరిమానా విధిస్తూ.. ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ జరిపించింది. తాజాగా ప్రజల తాగునీటి అవసరాలకు అవసరమయ్యే విధంగా 7.15 టీఎంసీల నీటి వరకు మాత్రమే పనులకు అనుమతిని ఇచ్చింది.