పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌లో అవతవకలు జరిగాయని దాఖలైన పిటిషన్‌పై విచారణ సుప్రీంకోర్టులో జరిగింది. సవరించిన అంచనాలతో ప్రాజెక్ట్ వ్యయం అక్రమంగా పెంచారంటూ నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
నాగం తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషన్... ఇటీవల ప్రాజెక్ట్ కాంట్రాక్టు సంస్థపై ఐటీ దాడులు జరిగాయని.. ఆదాయపన్ను శాఖను కూడా పిటిషన్లో పార్టీగా చేరిస్తే మరింత సమాచారం వస్తుందని కోర్టుకు తెలిపారు. ఐటీని పార్టీగా చేయని పక్షంలో సీబీఐ సమాచారం తీసుకుని కోర్టుకు తెలియజేసేలా చూడాలని ప్రశాంత్ భూషన్ కోరారు.
ఆదాయపన్ను శాఖ సోదాలకు సంబంధించి ఇచ్చిన పత్రికా ప్రకటనల్లో ఎక్కడా తమ సంస్థ పేర్లు లేవని.. ఆ విభాగాన్ని పార్టీగా చేయాల్సిన అవసరం లేదని మెఘా ప్రాజెక్ట్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పరిశీలించిన ధర్మాసనం... అవసరమనుకుంటే కేసు విచారణలో సీబీఐ సాయం అందించవచ్చని సూచించింది. దీనిపై సమగ్రంగా వచ్చే ఏడాది జనవరి 14న వాదనలు వింటామంటూ విచారణ వాయిదా వేసింది.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విచారణ జనవరి 14కు వాయిదా
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌లో అవకతవకలు జరిగాయని సుప్రీంలో దాఖలైన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం జనవరి 14వ తేదీకి వాయిదా వేసింది.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విచారణ జనవరి 14కు వాయిదా