చంద్రబాబు ఆస్తులపై లక్ష్మీపార్వతి పిటిషన్.. కొట్టేసిన సుప్రీంకోర్టు - చంద్రబాబు ఆస్తులపై లక్ష్మీపార్వతి పిటిషన్

11:42 September 09
లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
తెదేపా అధినేత చంద్రబాబు ఆస్తులపై విచారణ జరపాంటూ వైకాపా నేత లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఒకరి ఆస్తులు తెలుసుకోవడానికి మీరెవరని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు అన్ని విధాలా ఆలోచించే ఈ పిటిషన్‌ను కొట్టివేసిందని తెలిపింది. ఎవరి ఆస్తులు.. ఎవరికి తెలియాలని కోర్టు ప్రశ్నించింది. లక్ష్మీపార్వతి లేవనెత్తిన అంశానికి విలువ లేదంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.
ఇవీ చూడండి: