తెలంగాణ

telangana

ETV Bharat / state

హైకోర్టును ఆశ్రయించాలని అగ్రిగోల్డ్‌ పిటిషన్‌దారులకు సుప్రీం సూచన - Agrigold issue news

అగ్రిగోల్డ్‌ వ్యవహారానికి సంబంధించి దాఖలైన పిటిషన్‌ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇప్పటికే ఈ కేసులో తెలంగాణ హైకోర్టు పలు ఆదేశాలు ఇచ్చినందున..... ఈ వినతిని అక్కడే వినిపించాలని పిటిషనర్‌కు సూచించింది.

supreme-court-directs-agrigold-petitioner-to-approach-high-court
హైకోర్టును ఆశ్రయించాలని అగ్రిగోల్డ్‌ పిటిషన్‌దారులకు సుప్రీం సూచన

By

Published : Oct 27, 2020, 11:57 AM IST

అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలం, డిపాజిటర్లకు పంపిణీ విషయంలో హైకోర్టునే ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఆస్తుల వేలం ప్రక్రియను వేగవంతం చేసి, బాధితులకు పంపిణీ చేసేలా ఆదేశించాలని తెలంగాణ అగ్రిగోల్డ్‌ కస్టమర్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆండాళు రమేష్‌బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ అజయ్‌ రస్తోగిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.

హైకోర్టులో ఉన్న కేసులను సుప్రీంకోర్టుకు బదిలీ చేస్తే ఇక్కడ మరింత సమయం పడుతుందని జస్టిస్‌ లావు నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. లక్షలాది మంది డిపాజిటర్లతో ముడిపడిన అంశమైనందున కేసును త్వరగా విచారించాలని హైకోర్టుకు విన్నవించేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు పిటిషనర్‌కు ధర్మాసనం తెలిపింది.

ఇదీ చదవండి:నగదు దొరికినా నాటకాలేంటి: హరీశ్​రావు

ABOUT THE AUTHOR

...view details